Surprise Me!

Ramdhan Special : Hyderabadi Haleem History | హైదరాబాద్ హలీమ్ హిస్టరీ

2018-06-02 357 Dailymotion

the history of hyderabad haleem how a bland iftar dish from yemen got indianised

రంజాన్ మాసం ప్రారంభమైంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం
హాలీమ్ హవా మొదలైంది. రంజాన్ మాసం ఆధ్యాత్మిక మాసం. ముస్లిం సోదరులు ఉపవాసాల్లో, ఆరాధనల్లో గడిపే మాసం ఇది.
పగలంతా పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిష్టగా చేసే ఈ ఉపవాసాల నెలలో హైదరాబాదులో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక సందడి అలుముకుంటుంది. ఇఫ్తార్ విందులు ముస్లిం,ముస్లిమేతర సోదరుల్లో సమైక్యతకు వేదికలవుతున్నాయి.
అయితే ఈ మాసంలో హలీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హలీమ్ కు బార్కాస్ కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. నిజానికి ఇది బార్కాస్ కాదు, బారాక్స్. సైనికులుండే బారాక్స్ పదం భ్రష'రూపమే బార్కాస్.
నిజాము సైన్యం ఉండే బారాక్స్ ఇది ఒకప్పుడు. నిజాము సైన్యంలో అరబ్బు దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉండేవారు. వారిని చావూష్ లని పిలిచేవారు. అప్పట్లో అరబ్బు దేశాలు ఇంత సంపన్న దేశాలు కూడా కాదు.
నిజాం సైన్యంలో పనిచేయడానికి ముఖ్యంగా ఎమన్ దేశస్థులు చాలా మంది వచ్చారు. ఎమన్ లోని హజ్రల్ మౌత్ ప్రాంతానికి చెందినవారిని ఎక్కువగా నిజాము సైన్యంలో చేర్చుకున్నారు. ఈ సైనికులు విశ్వాసానికి, యుద్ధవిద్యలకు అప్పట్లో పేరుపొందినవారు. ముఖ్యంగా నిజాము వ్యక్తిగత రక్షణ దళంలో ఈ సైనికులు ఎక్కువగా ఉండేవారు.